
కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్‌ఎస్)లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ఈఎంఆర్‌ఎస్ నుంచి 23 జట్లు 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
విజేతలుగా నిలిచిన టీంలకు, క్రీడాకారులకు బహుమతులతో పాటు మెడల్స్, సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్ ఆర్ఎస్ యాదవ్, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్య నాయక్ అందజేశారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ జట్లకు ఎంపిక చేయనున్నట్లు స్పోర్ట్స్ ఆఫీసర్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై తిరుమలబాబు, పీడీలు, స్పోర్ట్స్ పాల్గొన్నారు.
జోనల్ పోటీలు ప్రారంభం
సుల్తానాబాద్ : మూడు రోజులపాటు నిర్వహించే ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి పోటీలు సుల్తానాబాద్ కాలేజ్ గ్రౌండ్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అండర్–14, 17 బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో సుల్తానాబాద్ మండల జట్లు విజేతలుగా నిలిచాయి. మున్సిపల్ కమిషనర్ టి. రమేశ్, డీవైఎస్‌వో సురేశ్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం. రవీందర్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్, జోనల్ కార్యదర్శి రమేశ్, ఎంపీడీవో దివ్యదర్శనరావు, ఎంఈఓ రాజయ్య, అంతర్జాతీయ క్రీడాకారుడు మధుకర్ పాల్గొన్నారు.