-
తప్పించుకున్న మావోయిస్టులు
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో గురువారం రాత్రి మావోయిస్ట్‌లు, పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. బొంతలంక-జారాపల్లి అటవీ ప్రాంతంలో చింతగుప్ప పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతవాగు సమీపంలో మావోయిస్టులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో బస్తర్ డీఐజీ కమలోచన్ కశ్యప్, సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ ఆధ్వర్యంలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ మొదలు పెట్టాయి. భద్రతాబలగాలు చింతవాగు దాటి మావోయిస్టుల శిబిరం వద్దకు చేరుకునే టైంలో గమనించిన మావోయిస్ట్‌లు బీజీఎల్‌లతో దాడికి పాల్పడ్డారు. తేరుకున్న భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. దీంతో మావోయిస్ట్‌లు సమీప అడవుల్లోకి పారిపోయారు. మావోయిస్టుల శిబిరం నుంచి భారీఎత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ చెప్పారు. పారిపోయిన మావోయిస్ట్‌ల కోసం అదనపు బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
ALSO READ | దారుణం.. ట్రీట్‌మెంట్ కోసం వచ్చి డాక్టర్‌ను కాల్చి చంపారు