కొండగట్టులో పోయిన వెండి 33 కిలోలు

కొండగట్టులో పోయిన వెండి 33 కిలోలు

కొండగట్టులో చోరీకి గురైన వెండి లెక్క తేల్చిన కమిషనర్​ 

ఆలయంలో తనిఖీలు చేసిన అనిల్​కుమార్​  

కొండగట్టు, వెలుగు : కొండగట్టు ఆలయంలో చోరీకి గురైన వెండి 33 కిలోలని ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ప్రకటించారు. చోరీకి గురైన వస్తువుల లెక్క పై, ఉన్నతాధికారులు గుట్టకు రాకపోవడంపై కొద్ది రోజుల నుంచి భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కమిషనర్ కొండగట్టుకు వచ్చారు. అంజన్నను దర్శించుకున్న తర్వాత తనిఖీలు చేశారు.

భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రం వద్ద నీళ్లను తాగి చూశారు. ఆలయంలో మరింత భద్రత పెంచాలని సూచించారు. లగేజ్ స్కానర్లను ఏర్పాటు చేయాలని, లడ్డూల తయారీ కేంద్రంలో చక్కెర నాణ్యత మెరుగుపరచాలన్నారు. ఎస్పీ భాస్కర్, డీఎస్పీ ప్రకాశ్ తో కొండగట్టు భద్రతపైనా, మాస్టర్ ప్లాన్ పైనా చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొద్ది రోజుల కింద ఆలయంలో 33 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్టు చెప్పారు.

త్వరలోనే కోర్టు ద్వారా ఆ వెండి వస్తువులను స్వాధీనం చేసుకుంటామన్నారు. టెంపుల్ స్టాఫ్ కు బార్ కోడ్ ఐడీ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. ఈఓ వెంకటేశ్, సర్పంచ్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.