యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి : ఆలయ ఈవో వెంకటరావు

యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి : ఆలయ ఈవో వెంకటరావు
  • ఎండోమెంట్ డైరెక్టర్, ఆలయ ఈవో వెంకటరావు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు‌‌‌‌‌‌‌‌ లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎండోమెంట్ డైరెక్టర్, ఆలయ ఈవో వెంకటరావు అధికారులకు సూచించారు. ఆదివారం యాదగిరికొండపైన ప్రసాద తయారీ, ప్యాకింగ్, అమ్మకం, శానిటేషన్ సహా పలు విభాగాలను ఆయన పరిశీలించారు. భక్తులతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ప్రసాద వితరణ కోసం ఆధునిక పరికరాలు తెప్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఈఈలు దయాకర్ రెడ్డి, రామారావు, ఏఈవోలు కృష్ణ, నవీన్ కుమార్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఆఫీసర్లు ఉన్నారు.