టెస్టు క్రికెట్ కు గుడ్ బై ప్రకటించిన మెయిన్ అలీ

టెస్టు క్రికెట్ కు గుడ్ బై ప్రకటించిన మెయిన్ అలీ

ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ టెస్టు క్రికెట్ కు గుడ్ బై ప్రకటించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కు మెయిన్ అలీ వీడ్కోలు చెప్పిన విషయాన్ని ఇంగ్లండ్ అడ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించగా.. ఐసీసీ ధృవీకరించింది. అటు తర్వాత టెస్టు ఫార్మాట్ ను మిస్సవుతున్నానంటూ మెయిన్ అలీ కూడా ప్రకటనచేశాడు. తీవ్రమైన పోటీ.. అంతే స్థాయిలో రెమ్యునరేషన్.. పేరు ప్రఖ్యాతులున్న టీ20 పోటీల్లో మరింత మెరుగ్గా రాణించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 34 ఏళ్ల మెయిన్ అలీ తెలియజేశాడు. వన్డేల్లోనూ కొనసాగుతూ.. టీ20 రేసులో కుర్రాళ్లతో కలసి ఆటను మరికొంత కాలం ఆస్వాదించడం కోసమే.. సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 
ఈ స్టార్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఐపీఎల్ టీ20ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్లో 63 టెస్టులు ఆడిన ఆల్ రౌండర్ మెయిన్ అలీ.. బ్యాటింగ్ లో 14 అర్థ సెంచరీలు, 5 సెంచరీలతో మొత్తం 2,914 పరుగులు చేసి 28.29 యావరేజ్ నమోదు చేశాడు. అలాగే ఆఫ్ స్పిన్ బౌలర్ గా కెరీర్ లో 195 వికెట్లు పడగొట్టి... దక్షిణాఫ్రికాతో సిరీస్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు.