ప్రీ క్వార్టర్స్లో సెనెగల్పై గెలిచిన ఇంగ్లాండ్

ప్రీ  క్వార్టర్స్లో సెనెగల్పై గెలిచిన ఇంగ్లాండ్

ఫిఫా వరల్డ్ కప్‌ 2022లో ఇంగ్లండ్ రెచ్చిపోతుంది. గ్రూప్ దశలో అద్భుతమైన ఆటతీరుతో  ప్రీ క్వార్టర్కు చేరిన ఇంగ్లాండ్...ప్రిక్వార్టర్స్ లో సెనెగల్పై విజయం సాధించింది. 3–0 గోల్స్ తేడాతో సెనెగల్ను చిత్తు చేసి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ పోరులో ఫ్రాన్స్తో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 10న జరగనుంది.

ఫస్టాఫ్లో ఇంగ్లాండ్ జోరు..

ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ సెనెగల్పై  ఆధిపత్యం చూపించింది. బాల్ను ఎక్కువ సేపు తమ నియంత్రణలో ఉంచుకున్న ఇంగ్లండ్.. నాలుగు సార్లు గోల్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అయితే 38వ నిమిషంలో జూడ్ బెల్లింగ్‌హామ్ ఇచ్చిన  పాస్‌ను చక్కగా ఉపయోగించుకున్న జోర్డాన్ హెండర్సన్ తొలి గోల్ చేసి ఇంగ్లాండ్కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. కాసేపటికే 48వ నిమిషంలో హ్యారీ కేన్ మరో గోల్ చేయడంతో  తొలి అర్థభాగం ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2–0 ఆధిక్యంలో నిలిచింది.

ఆధిక్యం కొనసాగించిన ఇంగ్లాండ్..

సెకండ్ హాఫ్లోనూ ఇంగ్లండ్ జోరును కొనసాగించింది. సెకండాఫ్ లో మొదలయ్యాక 87వ నిమిషంలో ఫోడెన్ అందించిన పాస్‌ను బుకాయా సాకి గోల్‌గా మలిచాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిక్యం 3-0కు చేరింది. ఆ తర్వాత సెనెగల్ పలు మార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించినా.. ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్  3–0తో గెలిచి క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది.