రష్యాతో ఫుట్బాల్ మ్యాచులను బహిష్కరించిన ఇంగ్లాండ్

రష్యాతో ఫుట్బాల్ మ్యాచులను బహిష్కరించిన ఇంగ్లాండ్

భవిష్యత్ లో రష్యాతో ఫుట్బాల్ ఆడేదిలేదని తెగేసి చెప్పింది ఇంగ్లాండ్. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి నిరసనగా, ఉక్రెయిన్ కు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లాండ్ ఫుట్బాల్ అసోసియేషన్ తెలిపింది. సీనియర్, జూనియర్, పారా.. ఇలా ఏ స్థాయి ఫుట్బాల్ మ్యాచులైనా సరే రష్యాతో ఆడబోయేదిలేదని ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. ఇప్పటికే పోలాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్ దేశాలు రష్యాతో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచులు ఆడబోమని స్పష్టం చేశాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంగ్లాండ్ కూడా చేరింది. రష్యాలో ఎలాంటి ఫుట్బాల్ టోర్నీలు నిర్వహించేదిలేదని ఫిఫా ప్రకటించింది. ఇక నుంచి రష్యా ఏ టోర్నీలో పాల్గొన్నా.. ఆ దేశ జెండాను కానీ, జాతీయ గీతాలపనను కానీ అంగీకరించేది లేదని ఫిఫా తెలిపింది.
 

మరి కొన్ని వార్తల కోసం:

ఇక నుంచి‘బరువు’ పన్ను!