
లండన్: సెకండ్ టెస్ట్‌లో తాము వ్యూహాత్మక తప్పిదాలు చేయడంతో పాటు.. ఇండియా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌ను తక్కువగా అంచనా వేశామని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. ‘ఓ కెప్టెన్‌గా చాలా తప్పులు నావైపు ఉన్నాయి. వ్యూహాత్మకంగా కొన్ని అంశాలను మరింత డిఫరెంట్‌గా చేయాల్సింది. షమీ, బుమ్రా పార్ట్‌నర్‌షిప్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దర్ని డీల్ చేయడంలో నేను ఫెయిల్ అయ్యా. వీళ్లను నిలువరించే స్ట్రాటజీని వర్కౌట్ చేయలేకపోయా. దీంతో మేం డిఫికల్ట్ సిచ్యువేషన్‌లో పడిపోయాం’ అని రూట్ వివరించాడు. తమ షార్ట్ బాల్ పాలసీ.. షమీ, బుమ్రాపై ఫెయిలైందన్నాడు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌తో పాటు స్టంప్‌పై వరుసగా అటాకింగ్ చేయకపోవడం, అనుకున్న స్థాయిలో షార్ట్‌బాల్స్‌ను ప్రయోగించలేకపోయామన్నాడు. బుమ్రా, షమీ ఊహించని ప్లేస్‌ల్లోకి షాట్స్ కొట్టి రన్స్ రాబట్టారని చెప్పాడు.