స్టోక్స్ జోరు.. పాక్‌‌‌‌పై ఇంగ్లండ్‌‌‌‌ గెలుపు

స్టోక్స్ జోరు..  పాక్‌‌‌‌పై ఇంగ్లండ్‌‌‌‌ గెలుపు

కోల్‌‌‌‌కతా :  ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్‌‌‌‌... వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో చెలరేగింది. బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (84), జో రూట్‌‌‌‌ (60), బెయిర్‌‌‌‌స్టో (59) సమష్టిగా రాణించడంతో.. శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ 93 రన్స్‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై గెలిచింది. దీంతో 2025 చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీకి డైరెక్ట్​గా అర్హత సాధించింది. టాస్‌‌‌‌ గెలిచిన ఇంగ్లండ్‌‌‌‌ 50 ఓవర్లలో 337/9 స్కోరు చేసింది. డేవిడ్‌‌‌‌ మలన్‌‌‌‌ (31), బెయిర్‌‌‌‌స్టో తొలి వికెట్‌‌‌‌కు 82 రన్స్‌‌‌‌ జత చేసి శుభారంభాన్నిచ్చారు. 

తర్వాత రూట్‌‌‌‌, స్టోక్స్‌‌‌‌ మూడో వికెట్‌‌‌‌కు 132 రన్స్‌‌‌‌ జత చేశారు. చివర్లో బట్లర్‌‌‌‌ (30), హ్యారీ బ్రూక్‌‌‌‌ (30) ఫర్వాలేదనిపించినా లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఫెయిలైంది. క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ (4 నాటౌట్‌‌‌‌), డేవిడ్‌‌‌‌ విల్లే (15), అట్కిన్సన్‌‌‌‌ (0), ఆదిల్‌‌‌‌ రషీద్‌‌‌‌ (0 నాటౌట్‌‌‌‌) ఫెయిలయ్యారు. తర్వాత పాకిస్తాన్‌‌‌‌ 43.3 ఓవర్లలో 244 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఆగా సల్మాన్‌‌‌‌ (51) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. 10 రన్స్‌‌‌‌కే అబ్దుల్లా షఫీక్‌‌‌‌ (0), ఫకర్‌‌‌‌ జమాన్‌‌‌‌ (1) ఔటయ్యారు. మిడిలార్డర్‌‌‌‌లో బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌(38), రిజ్వాన్‌‌‌‌ (36), హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌ (35), షాహీన్​ ఆఫ్రిది (25) నిలకడగా ఆడారు.  3 వికెట్లు తీసిన విల్లేకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.