ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కే ఆధిక్యం.. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్ 386 ఆలౌట్​​

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కే ఆధిక్యం.. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్ 386 ఆలౌట్​​

బర్మింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌‌‌‌‌‌‌‌ తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కే ఆధిక్యం లభించింది. 311/5 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో మూడో రోజ ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 116.1 ఓవర్లలో 386 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు 7 రన్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం లభించింది. ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖవాజ (141), అలెక్స్‌‌‌‌‌‌‌‌ క్యారీ (66) ఔటైన తర్వాత  కమిన్స్‌‌‌‌‌‌‌‌ (38) ఫర్వాలేదనిపించాడు. లైయన్‌‌‌‌‌‌‌‌ (1), స్కాట్‌‌‌‌‌‌‌‌ బోలాండ్‌‌‌‌‌‌‌‌ (0), హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ (1 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఫెయిలయ్యారు. బ్రాడ్‌‌‌‌‌‌‌‌, రాబిన్సన్‌‌‌‌‌‌‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. లంచ్​ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన ఇంగ్లండ్​ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 10.3 ఓవర్లలో 28/2 స్కోరుతో ఉన్న సమయంలో వర్షం వచ్చింది. దాంతో చివరి రెండు సెషన్లలో ఆట సాధ్యం కాలేదు.  పోప్‌‌‌‌‌‌‌‌ (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), రూట్‌‌‌‌‌‌‌‌ (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. క్రాలీ (7), డకెట్‌‌‌‌‌‌‌‌ (19) నిరాశపర్చారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ మొత్తంగా 35 రన్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో ఉంది.