వన్డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు

వన్డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు

వన్డే క్రికెట్లో ఇంగ్లాండ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. నెదర్లాండ్స్తో జరిగిన ఫస్ట్ వన్డేలో  50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు సాధించింది.  500 పరుగులకు కేవలం 2 పరుగులు దూరంలో ఇన్నింగ్స్ను ముగించింది. ఇక వన్డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

నెదర్లాండ్స్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో బ్రిటీష్ టీమ్..ఈ భారీ స్కోరు నమోదు చేసింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న నెదర్లాండ్స్ భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పొచ్చు. ఓపెనర్ జేసన్ రాయ్ ఒకే ఒక్క పరుగు చేసి ఔటైనా..మరో ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్, వన్ డౌన్ బ్యాట్స్మన్ డేవిడ్ మలాన్ సెంచరీలతో దుమ్మురేపారు. సాల్ట్ కేవలం 93 బంతుల్లోనే 122 పరుగులు చేయగా..మలాన్ 109 బాల్స్లో 125 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన బట్లర్ నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 70 బంతుల్లోనే  162 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 14 సిక్సర్లు ఉండటం విశేషం. మోర్గాన్ డకౌట్ కాగా..చివర్లో వచ్చిన లివింగ్ స్టోన్ బట్లర్తో కలిసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లోనే 66 పరుగులు పిండుకున్నాడు. అందులో 6 సిక్సర్లు, 6 ఫోర్లున్నాయి. దీంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 498 రన్స్ సాధించి ..వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. 

ఇప్పటి వరకు వన్డేల్లో  టాప్-2 స్కోర్లు  ఇంగ్లాండ్ పేరిటే ఉన్నాయి.  2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 481 పరుగులు సాధించింది. 2016లో పాకిస్తాన్ పై 444 రన్స్ కొట్టింది. ఆ తర్వాత  2006లో శ్రీలంక నెదర్లాండ్స్ పైనే 443 పరుగులు కొట్టింది. అంతకుముందు సౌతాఫ్రికా  2014లో వెస్టిండీస్పై 439 రన్స్ సాధించింది.