
పెర్త్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్.. టీ20 వరల్డ్‌కప్‌లో శుభారంభం చేసింది. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ సామ్ కరన్ (5/10) సూపర్ షో చూపెట్టడంతో.. శనివారం జరిగిన సూపర్–12, గ్రూప్–1 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 19.4 ఓవర్లలో 112 రన్స్‌కే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) మినహా మిగతా వారు విఫలమయ్యారు. కరన్, స్టోక్స్ (2/13), మార్క్ వుడ్ (2/23) ముప్పేట చేసిన బౌలింగ్ దాడికి అఫ్గాన్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 113/5 స్కోరు చేసి గెలిచింది. లివింగ్‌స్టోన్ (19 నాటౌట్), హేల్స్ (19), బట్లర్ (18) రాణించారు. కరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.