ఇంగ్లండ్‌‌ పేసర్‌‌ జేమ్స్‌అండర్సన్‌‌ వరల్డ్‌‌ రికార్డ్

ఇంగ్లండ్‌‌ పేసర్‌‌ జేమ్స్‌అండర్సన్‌‌ వరల్డ్‌‌ రికార్డ్

అతనో పవర్ఫుల్ పేసర్. స్వింగ్లో కింగ్. రివర్స్ స్వింగ్‌‌లో రారాజు. టెస్టు క్రికెట్‌‌లో,యాషెస్ సమరంలో తిరుగులేని మొనగాడు. వన్డేల్లో హ్ యాట్రిక్ తీసిన ఇంగ్లండ్ తొలిబౌలర్. ఆ దేశం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌‌లో హయ్యెస్ట్ ‌వికెట్స్ ‌‌పడగొట్టిన క్రికెటర్. ఇలా చెప్పుకుంటూ పోతే జేమ్స్ ‌అండర్సన్ ‌‌రికార్డులెన్నో. తన పేరు చెబితేనే బ్యాట్స్‌‌మెన్ ‌‌వెన్నులో వణుకు పుట్టించే ఈ ఇంగ్లిష్ ‌‌వీరుడి ఖాతాలో మరో అద్భుత ఘనత చేరింది. టెస్టు క్రికెట్ ‌‌చరిత్రలో 600 వికెట్లు తీసిన తొలి పేసర్ గా రికార్డు సృష్టించాడు. హోమ్‌‌గ్రౌండ్‌‌లో పాకిస్తాన్‌‌తో థర్డ్ ‌టెస్టు సెకండ్ ‌‌ఇన్నింగ్స్‌‌లో పాక్ ‌‌కెప్టెన్ ‌‌అజర్ అలీని ఔట్‌‌చేసి ఈ ఫీట్‌‌ సాధించిన అండర్సన్ ‌ఈ తరం పేసర్లలో ఓ వండర్..!

(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) టెస్టు క్రికెట్‌‌‌‌లో 600 ప్లస్‌ వికెట్లు తీసిన బౌలర్లు నలుగురే. అందులో తొలి మూడు స్థానాలు స్పిన్నర్ల‌వే. అయితే నాలుగో వాడు జేమ్స్ ‌‌‌‌అండర్సన్. అతని బౌలింగ్‌ పవర్ గురించి చెప్పేందుకు ఈ ఒక్క లెక్క చాలు. ఇండియా లెజెండ్‌‌‌ కపిల్ దేవ్‌‌‌ ఐదొందల మార్కు దాకా రాలేకపోయాడు. వెస్టిండీస్ గ్రేట్‌ కోట్నీ వాల్ష్‌కు 600 వికెట్ల ఘనత సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా అసాధ్యుడు గ్లెన్‌గ్లె మెక్‌‌‌‌గ్రాత్ ‌‌‌‌సైతం ఆ మార్కు అందుకోలేకపోయాడు. కానీ, ఈ ఇంగ్లీష్ వీరుడు మాత్రం అలవోకగా సాధించాడు. టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే మోస్ట్ ‌సక్సెస్‌ఫుల్‌ పేసర్ తానేనని నిరూపించాడు. మెక్‌‌‌‌గ్రాత్‌‌‌‌ను వెనక్కు నెట్టి టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్ గా ఎప్పుడో రికార్డు సృష్టించిన అండర్సన్‌ అక్కడితో ఆగలేదు. వయసు మీద పడుతున్నా పోరాటం ఆపలేదు. నిత్య విద్యార్థిలా శ్రమిస్తూ ఆరొందల మార్కును అందుకోవడం అభినందనీయం.
పడుతూ లేస్తూ..
38 ఏళ్ల‌ అండర్స‌న్ ఇంగ్లండ్‌‌‌‌ క్రికెట్‌ హిస్టరీలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఫాస్ట్‌బౌలర్. టెస్టు క్రికెట్‌లో, ముఖ్యంగా సొంతగడ్డపై అతనికి ఎదురేలేదు. ఇంగ్లండ్‌‌‌‌ నెగ్గిన‌ మూడు యాషెస్‌ విక్ట‌రీల్లో జిమ్మీ పాలు పంచుకున్నాడు. టీనేజ్‌లోనే టాలెంటెడ్ ‌‌‌‌పేసర్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ జిమ్మీ కెరీర్ పూలదారి కాలేదు. అనేక గాయాలు సవాల్‌ విసిరాయి. నిలకడలేమి కొన్ని సార్లు జట్టుకు దూరం చేసింది. ఇంట్లోనే పులి అన్న విమర్శలు వచ్చాయి. అయినా అతను ఏనాడూ పోరాటం ఆపలేదు. కిందపడ్డప్రతీసారి ఫీనిక్స్‌‌‌‌పక్షిలా పైకి లేచాడు. అండర్సన్ ఇంటర్నేషనల్ ‌అరంగేట్రం నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన జిమ్మీ 2002లో ఇంగ్లండ్‌‌‌ వన్డే టీమ్‌లోకి వచ్చాడు. ఆ ఏడాది ఆస్ట్రేలియాలో వీబీ సిరీస్‌లో ఆండీ కాడిక్‌‌‌‌కు కవర్‌గా అతడిని తీసుకున్నారు.

అప్పటికి జిమ్మీకి ఒక నంబర్ కానీ, టీ షర్ట్‌పై పేరు కానీ లేదు. పైగా క్లోజ్‌ ఫ్రెండ్స్‌‌‌ తప్ప ఎవరితోనైనా మాట్లాడాలంటేనే సిగ్గుపడేవాడు. కానీ, అతని బంతులే మాట్లాడేవి. అడిలైడ్‌‌‌‌లో ఆసీస్‌పై పది ఓవర్ల‌లో 12 పరుగులే ఇచ్చిన జిమ్మీ తర్వాతి ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు ఎంపికవడంతో పాటు టెస్టు అరంగేట్రం కూడా చేశాడు. జింబాబ్వేపై ఫస్ట్‌టెస్టులో ఐదు వికెట్ల పెర్ఫామెన్స్‌‌‌‌, పాకిస్తాన్‌తో వన్డేలో హ్యాట్రిక్‌‌‌‌తో రెండు ఫార్మాట్లలో కుదురుకున్నాడు. కానీ, తరచూ గాయపడేవాడు. వాటిని తప్పించుకునేందుకు బౌలింగ్‌ యాక్షన్‌ను మార్చుకోవడంతో అతని పేస్‌, రిథమ్‌ దెబ్బతిన్నది. ఇక, 2010 తర్వాత జిమ్మీ తన బౌలింగ్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. కేవలం మ్యాజిక్ బాల్స్‌‌‌‌ కోసం మాత్రమే చూడకుండా పక్కా లైన్ అండ్‌‌ ‌లెంగ్‌‌‌‌ తో మెయి డిన్స్‌‌‌‌వేస్తూ, ప్రతి స్పెల్‌లో అపోనెంట్‌పై ప్రెజర్ తెస్తూ సవాల్‌ విసిరాడు. ఈ క్రమంలో 2009, 2011, 2013 యాషెస్‌ సిరీస్‌‌‌‌ల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా 2011లో ఆసీస్ వేదికగా జరిగిన యాషెస్‌ లో 24 వికెట్లతో కంగారూల పని పట్టి విదేశీ గడ్డపై కూడా సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. సంప్రదాయ స్వింగ్‌, సీమ్‌కు రివర్స్ ‌‌
స్వింగ్‌ కూడా జోడించి కంప్లీట్‌ ఫాస్ట్‌బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. రివర్స్ ‌‌‌‌స్వింగ్‌లో అండర్స న్‌ను మించినోడు లేడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సైతం ప్రశంసించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం