రూట్‌‌ సెంచరీ.. ఇంగ్లండ్​ 393/8 డిక్లేర్డ్​

రూట్‌‌ సెంచరీ.. ఇంగ్లండ్​ 393/8 డిక్లేర్డ్​

బర్మింగ్‌‌హామ్‌‌: ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన యాషెస్‌‌ సిరీస్​ తొలి టెస్ట్‌‌లో ఇంగ్లండ్‌‌ భారీ స్కోరు చేసింది. మాజీ కెప్టెన్‌‌ జో రూట్‌‌ (118 నాటౌట్‌‌) సెంచరీతో చెలరేగడంతో టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌ చేసిన ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ను 78 ఓవర్లలో 393/8 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. ఓపెనర్​ బెన్‌‌ డకెట్‌‌ (12) ఫెయిలైనా, జాక్‌‌ క్రాలీ (61), ఒలీ పోప్‌‌ (31) ఫర్వాలేదనిపించారు. 92/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన రూట్‌‌ ఆసీస్‌‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. హ్యారీ బ్రూక్‌‌ (32) ఫర్వాలేదనిపించినా, కెప్టెన్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ (1) నిరాశపర్చాడు.

మిడిలార్డర్‌‌లో బెయిర్‌‌స్టో (78)తో కలిసి ఆరో వికెట్‌‌కు 121 రన్స్‌‌ జోడించిన రూట్‌‌ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. మొయిన్‌‌ అలీ (18), బ్రాడ్‌‌ (16), రాబిన్సన్‌‌ (17 నాటౌట్‌‌) ఓ మాదిరిగా ఆడారు. ఆసీస్‌‌ బౌలర్లలో నేథన్‌‌ లైయన్‌‌ 4, హేజిల్‌‌వుడ్‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌లో 4 ఓవర్లలో 14 రన్స్‌‌ చేసింది. వార్నర్‌‌ (8 బ్యాటింగ్‌‌), ఖవాజ (4 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కంగారూలు ఇంకా 379 రన్స్‌‌ వెనకబడి ఉన్నారు.