
సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్ విశ్వరూపమే చూపించింది. స్వదేశంలో సిరీస్ ఓడిపోయామనే బాధ ఒక వైపు.. మరోవైపు సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలనే ఒత్తిడి మూడో వన్డేకు ముందు ఇంగ్లాండ్ జట్టును ఆందోళనకు గురి చేశాయి. తమలోని అసలైన ఆటను చూపిస్తూ సఫారీలపై జూలు విదిల్చింది. ఏకంగా 342 పరుగుల భారీ తేడాతో మూడో వన్డేల్లో గెలిచి 50 ఓవర్ల ఫార్మాట్ లో బిగ్గెస్ట్ విక్టరీ అందుకున్నారు. ఈ రికార్డ్ అంతకముందు టీమిండియా పేరిట ఉంది. 2023లో తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 317 పరుగు తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ 166 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే.. శుభమాన్ గిల్ 116 పరుగులు చేసి కోహ్లీతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 73 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ నాలుగు వికెట్లతో శ్రీలంకను కుప్పకూల్చారు. షమీ, కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టారు. రెండేళ్ల తర్వాత ఆదివారం (సెప్టెంబర్ 7) సౌతాఫ్రికాపై 342 పరుగుల భారీ విజయంతో ఇండియాను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ అగ్ర స్థానంలోకి వచ్చింది.
ALSO READ : ట్రై సిరీస్ విజేత పాకిస్థాన్..
పరుగుల పరంగా వన్డే క్రికెట్‌లో అతిపెద్ద విజయాలు:
1 - 342 పరుగులు - ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, సౌతాంప్టన్, 2025
2 - 317 పరుగులు - 2023 తిరువనంతపురంలో, భారత్ vs శ్రీలంక
3 - 309 పరుగులు - ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్, ఢిల్లీ, 2023
4 - 304 పరుగులు - జింబాబ్వే vs USA, 2023 హరారే
5 - 302 పరుగులు - 2023 భారత్ vs శ్రీలంక, ముంబై వెస్ట్రన్ వరల్డ్ కప్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్ (100), జాకబ్ బెథేల్ (110) సెంచరీలతో కదం తొక్కగా.. జేమీ స్మిత్ 62, డకెట్ 31 పరుగులతో రాణించారు. చివర్లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ (62), విల్ జాక్స్ (19) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 415 పరుగుల భారీ చేధనకు దిగిన సౌతాఫ్రికా జట్టు కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారీ చేధనలో సఫారీ జట్టు పూర్తిగా తేలిపోయింది. సౌతాఫ్రికాలో ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సపారీ బ్యాటర్లలో హాయొస్ట్ స్కోర్ 20 పరుగులు. ఇంగ్లాండ్ బౌలర్లు ఆర్చర్ 4, ఆదిల్ రషీద్ 3 వికెట్లతో సౌతాఫ్రికా పతానాన్ని శాసించారు. ఈ ఇద్దరి ధాటికి 415 పరుగుల చేధనలో సౌతాఫ్రికా కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయ్యి 342 రన్స్ తేడాతో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది.
THE BIGGEST-EVER MARGIN OF WIN IN AN ODI BY RUNS!
— ESPNcricinfo (@ESPNcricinfo) September 7, 2025
🔗 https://t.co/hboolAQas4 pic.twitter.com/6srWXt4UzB