పోప్‌‌‌‌ పట్టు వదల్లే.. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 316/6

పోప్‌‌‌‌ పట్టు వదల్లే.. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 316/6

పోప్‌‌‌‌ పట్టు వదల్లే..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 316/6
 126 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో ఇంగ్లిష్ టీమ్
 తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో ఇండియా 436 ఆలౌట్
ఉప్పల్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌తో     తొలి టెస్ట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో మూడు రోజుల్లోనే ముగుస్తుందనుకున్న ఇండియా– ఇంగ్లండ్ తొలి టెస్ట్ నాలుగో రోజుకు చేరింది. ఒలీ పోప్‌‌‌‌ (208 బాల్స్‌‌‌‌లో 17 ఫోర్లతో 148 బ్యాటింగ్‌‌‌‌) అద్భుత సెంచరీతో ఇంగ్లిష్ టీమ్‌‌‌‌ను రేసులోకి తెచ్చాడు. 190 పరుగుల లోటు స్కోరును దాటించి జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. దీంతో శనివారం మూడో రోజు చివరకు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో ఇంగ్లండ్ 316/6 స్కోరు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 126 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతున్నది. పోప్‌‌‌‌కు తోడు రెహాన్ అహ్మద్ (16 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 421/7తో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 436  రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. జడేజా (87), అక్షర్‌‌‌‌‌‌‌‌ (44), బుమ్రా (0) వెంటవెంటనే పెవిలియన్‌‌‌‌ చేరారు. జో రూట్‌‌‌‌4 వికెట్లు తీశాడు. 

టాప్‌‌‌‌ త్వరగానే..

మూడో రోజు 11 ఓవర్లలోనే మిగిలిన మూడు వికెట్లు పడగొట్టి రెండో ఇన్నింగ్స్‌‌‌‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌‌‌‌కు మంచి ఆరంభమే దక్కించుకుంది. ఓపెనర్లు జాక్‌‌‌‌ క్రాలీ (31), బెన్ డకెట్‌‌‌‌ (47) ఫస్ట్ ఇన్నింగ్స్‌‌‌‌ మాదిరిగా దూకుడుగా బ్యాటింగ్‌‌‌‌ చేశారు. అక్షర్ వేసిన ఏడో ఓవర్లో క్రాలీ సిక్స్‌‌‌‌, డకెట్‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌తో అలరించారు. కానీ, పదో ఓవర్లో అశ్విన్‌‌‌‌ వేసిన స్లో డిప్పింగ్ బాల్‌‌‌‌ను డిఫెండ్‌‌‌‌ చేసే ప్రయత్నంలో క్రాలీ స్లిప్‌‌‌‌లో రోహిత్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో తొలి వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్ అయింది. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో పోప్‌‌‌‌ తోడుగా డకెట్‌‌‌‌ జోరు కొనసాగించాడు. దీంతో 89/1తో లంచ్‌‌‌‌ బ్రేక్ వెళ్లొచ్చిన తర్వాత అశ్విన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో వరుసగా రెండు బౌండ్రీలు కొట్టిన పోప్‌‌‌‌ స్కోరు వంద దాటించాడు. ఆ వెంటనే బుమ్రా బౌలింగ్‌‌‌‌లో డకెట్‌‌‌‌ కూడా రెండు ఫోర్లు రాబట్టాడు. కానీ ఇన్‌‌‌‌ స్వింగింగ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌తో అతడిని బౌల్డ్‌‌‌‌ చేసిన బుమ్రా రివెంజ్‌‌‌‌ తీర్చుకున్నాడు. దాంతో రెండో వికెట్‌‌‌‌కు 68 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయింది. తన తర్వాతి ఓవర్లోనే మరో ఇన్‌‌‌‌ స్వింగర్‌‌‌‌‌‌‌‌తో జో రూట్‌‌‌‌ (2)ను ఎల్బీ చేసిన బుమ్రా ఇండియా శిబిరంలో జోష్‌‌‌‌ నింపాడు. ఓ ఎండ్‌‌‌‌లో పోప్‌‌‌‌ నిలకడగా ఆడినా.. బెయిర్‌‌‌‌‌‌‌‌ స్టో (10), బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌(2) నిరాశపరిచారు. జడేజా బౌలింగ్‌‌‌‌లో బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో, అశ్విన్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో స్టోక్స్‌‌‌‌ బౌల్డ్ అవడంతో ఇంగ్లండ్ 163/5తో కష్టాల్లో పడింది. 

112 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ 

ఈ దశలో ఇండియా బౌలర్ల జోరుకు పోప్‌‌‌‌ అడ్డుకట్ట వేశాడు. అతనికి కీపర్ బెన్‌‌‌‌ ఫోక్స్‌‌‌‌ (34) మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరు హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాడు. 172/5తో టీ బ్రేక్‌‌‌‌కు వెళ్లిన పోప్‌‌‌‌ మూడో సెషన్‌‌‌‌లోనూ జోరు కొనసాగించాడు. అతని వికెట్‌‌‌‌ కోసం రోహిత్‌‌‌‌ ఫీల్డింగ్, బౌలర్లను మారుస్తూ చాలా ప్రయత్నాలు చేసినా సక్సెస్‌‌‌‌ కాలేదు. అక్షర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో పోప్‌‌‌‌ ఎల్బీ కోసం ఓ రివ్యూ కూడా వేస్ట్‌‌‌‌ చేశాడు. 48 ఓవర్లో ఇంగ్లండ్‌‌‌‌ లోటు స్కోరును దాటి ఆధిక్యంలోకి వచ్చింది. ఈ క్రమంలో పోప్‌‌‌‌154 బాల్స్‌‌‌‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా బౌలింగ్‌‌‌‌లో 110 రన్స్ వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను అక్షర్ డ్రాప్‌‌‌‌ చేశాడు. కొద్దిసేపటికే బెన్‌‌‌‌ ఫోక్స్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన అక్షర్ ఆరో వికెట్‌‌‌‌కు 112 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేశాడు. రెహాన్ అహ్మద్‌‌‌‌ తోడుగా స్కోరు 300 దాటించిన పోప్‌‌‌‌ మరో వికెట్‌‌‌‌ పడకుండా రోజును ముగించాడు.