టీమిండియా జోరు కొనసాగేనా?

టీమిండియా జోరు కొనసాగేనా?

లీడ్స్‌‌‌‌: ప్రఖ్యాత లార్డ్స్‌‌‌‌లో సాధించిన సూపర్‌‌‌‌ విక్టరీతో ఫుల్‌‌‌‌జోష్‌‌‌‌లో ఉన్న టీమిండియా మరో సవాల్‌‌‌‌కు రెడీ అయ్యింది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా బుధవారం నుంచి  మొదలయ్యే మూడో టెస్ట్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌ను ఢీకొట్టనుంది. వరుణుడి పుణ్యమాని తొలి టెస్టులో ఓటమి తప్పించుకున్న ఇంగ్లండ్‌‌‌‌పై.. సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా అద్బుత విజయం సాధించింది. దీంతో 1–0తో లీడ్‌‌‌‌లో ఉన్న కోహ్లీసేన ఫుల్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌తో థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో బరిలోకి దిగుతోంది. ఇందులో గెలిచి సిరీస్‌‌‌‌పై పట్టుబిగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోపక్క బ్యాటింగ్‌‌‌‌ ఫెయిల్యూర్స్‌‌‌‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆతిథ్య జట్టు పూర్తి ఒత్తిడిలో ఉంది.  

జడేజా, అశ్విన్‌‌‌‌లో ఎవరు ?

స్పిన్నర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ అంశం తప్పా ఇప్పుడున్న సిచ్యువేషన్‌‌‌‌లో  టీమిండియా ఫైనల్‌‌‌‌ ఎలెవెన్‌‌‌‌లో మార్పులకు చాన్స్‌‌‌‌ కనిపించడం లేదు.  మంగళవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌‌‌‌లో  కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ కూడా ఇదే రెస్పాన్స్‌‌‌‌ ఇచ్చాడు. విన్నింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ను మార్చాల్సిన అవసరం కనిపించడం లేదన్నాడు. అయితే, మ్యాచ్‌‌‌‌లోని మూడు, నాలుగు రోజుల్లో  పిచ్‌‌‌‌ ఎలా రియాక్ట్‌‌‌‌ అవుతుందో అంచనాకి వచ్చాక  తుది జట్టులో అవసరమైతే మార్పులు చేస్తామని మెలిక పెట్టాడు.  దీంతో మ్యాచ్‌‌‌‌ మొదలయ్యే వరకు అశ్విన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌పై సస్పెన్స్‌‌‌‌ కొనసాగనుంది. వెదర్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ ప్రకారం  హెడింగ్లేలో రానున్న ఐదు రోజుల్లో వాతావరణం చల్లగా, మేఘావృతమై ఉండనుంది.  దీంతో వికెట్‌‌‌‌ పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా, షమీ, సిరాజ్‌‌‌‌, ఇషాంత్‌‌‌‌ జట్టులో ఉండటం ఖాయం.  అయితే, ఏకైక స్పిన్నర్‌‌‌‌గా రవీంద్ర జడేజాను కొనసాగిస్తారా లేదంటే అశ్విన్‌‌‌‌కు ప్లేస్‌‌‌‌ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.   బ్యాటింగ్‌‌‌‌లో ఇండియాకు పెద్దగా సమస్యల్లేవు. 

రూట్‌‌‌‌పైనే భారం..

సిరీస్‌‌‌‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లోనూ బ్యాటింగ్‌‌‌‌ వైఫల్యమే ఇంగ్లండ్‌‌‌‌ను దెబ్బతీసింది. కెప్టెన్‌‌‌‌ రూట్‌‌‌‌ తప్ప మరే బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ ఇండియా బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి డేవిడ్‌‌‌‌ మలాన్‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు.  రోరీ బర్న్స్‌‌‌‌, హసీబ్‌‌‌‌ హమీద్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌ ఎక్కువగా ఉంది. బెయిర్‌‌‌‌ స్టో, బట్లర్‌‌‌‌, మొయిన్‌‌‌‌ అలీ మిడిల్‌‌‌‌ భారాన్ని మోయనున్నారు.