
మహిళల వరల్డ్ కప్ లో ఇండియా, ఇంగ్లాండ్ జట్ల వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (అక్టోబర్ 19) ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కౌర్ సేన బౌలింగ్‌పైనే ఎక్కువగా దృష్టి సారించింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై 251, 330 రన్స్ చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోవడంతో ఇప్పుడు ఆరో బౌలర్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. బౌలింగ్‌లో మరింత బ్యాలెన్స్ తీసుకురావాలని టీమ్ మేనేజ్‌మెంట్ ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. జెమీమా రోడ్రిగ్స్ స్థానంలో రేణుక ఠాకూర్ కు చాన్సు దక్కింది.
భారత మహిళలు (ప్లేయింగ్ XI):
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్
Also Read : తీరు మార్చుకొని గంభీర్..
ఇంగ్లాండ్ మహిళలు (ప్లేయింగ్ XI):
అమీ జోన్స్ (వికెట్ కీపర్ , టామీ బ్యూమాంట్, హీథర్ నైట్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ కాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్