18 ఏళ్ల తర్వాత 400 స్కోరు

18 ఏళ్ల తర్వాత 400 స్కోరు

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్లోని గ్లామోర్గాన్ టీమ్ బ్యాట్స్మన్  సామ్ నార్త్ ఈస్ట్ లీస్టర్ షైర్తో జరిగిన  మ్యాచ్లో 410 రన్స్ సాధించాడు. 410 పరుగులు చేయడమే కాకుండా అతను నాటౌట్గా నిలిచాడు. మొత్తం 450 బంతుల్లో 45 ఫోర్లు, 3 సిక్సులతో ఈ భారీ స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు సామ్‌ మొత్తం 191 ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాడు. 324 ఇన్నింగ్స్లలో 39 సగటుతో 11, 556 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 61 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అతని కెరీర్‌ బెస్ట్ స్కోరు 191 నాటౌట్‌ మాత్రమే. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 ఆటగాళ్ల జాబితాలో సామ్ నార్త్ ఈస్ట్ చేరిపోయాడు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో విండీస్ లెజెండ్ బ్రియాన్ లారా ఉన్నాడు. అతను 1994లో వార్విక్ షైర్ తరఫున  501 రన్స్ కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 400 పైగా రన్స్ చేయడం 18 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైం. చివరగా 2004లో ఆంటిగ్వా టెస్టులో లారా ఇంగ్లాండ్ పై 400 పరుగులతో అజయంగా నిలిచాడు. ఈ స్కోరే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది. 

చాలా టెన్షన్ పడ్డా..
క్వాడ్రఫుల్ సెంచరీ ముందు చాలా టెన్షన్ పడ్డానని సామ్ నార్త్ ఈస్ట్ తెలిపాడు. 390పరుగుల వద్ద ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. గతంలో 190లలో ఉన్నప్పుడే మరింత టెన్షన్ పడ్డానని..అందుకే డబుల్ సెంచరీ చేయలేకపోయానని తెలిపాడు. 

సామ్ సూపర్ ఇన్నింగ్స్..గ్లామోర్గన్ టీమ్ విజయం..
సామ్ సూపర్ ఇన్నింగ్స్ తో  గ్లామోర్గన్ టీమ్ ఇన్నింగ్స్ 28 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో లీసెస్టర్‌షైర్ జట్టు 584పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్ ఇంగ్రామ్  సెంచరీ, సామ్ నార్త్ ఈస్ట్  క్వాట్రఫుల్ సెంచరీ,  కుక్ భారీ సెంచరీతో  5 వికెట్లకు 795 పరుగులు కొట్టింది. దీంతో 211పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లీసెస్టర్ షైర్ 183పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది.