మావోయిస్టుల హత్యలపై విచారణ జరిపించాలి

మావోయిస్టుల హత్యలపై విచారణ జరిపించాలి

గోదావరిఖని, వెలుగు: మావోయిస్ట్​ పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఇతర మావోయిస్టుల హత్యలపై సిట్టింగ్​జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ ఎంఎల్​ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.శ్రీనివాస్​, ఇప్టూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ డిమాండ్​ చేశారు. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని ప్రెస్‌‌క్లబ్‌‌లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు  దోచిపెట్టేందుకే  రహస్య ఒప్పందంలో భాగంగా మోదీ సర్కార్​ ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించారు. అంతకుముందు గాంధీనగర్‌‌‌‌లోని ఇఫ్టూ ఆఫీస్​ నుంచి ప్రెస్ క్లబ్​ వరకు ర్యాలీ నిర్వహించారు.