కోటగిరి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం కోటగిరి మండల కేంద్రంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో హక్‌కీ ఆవాజ్ యూత్ సభ్యులు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి ఏనుగు రవీందర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాన్సువాడలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని ప్రస్తుతం మైనారిటీ సోదరులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఎత్తొండలో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్, తదితరులు పాల్గొన్నారు.