ఎలక్ట్రిక్​ కారులో పర్యావరణ మంత్రి

ఎలక్ట్రిక్​ కారులో పర్యావరణ మంత్రి

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ పార్లమెంట్​కు ఎలక్ట్రిక్​ కారులో వచ్చి అందర్నీ సర్​ప్రైజ్​ చేశారు. ఢిల్లీలో పెరిగిపోతున్న పొల్యూషన్​ను దృష్టిలో ఉంచుకునే తాను ఎలక్ట్రిక్​ కారును ప్రిఫర్​ చేశానన్నారు. అతిత్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లో పెట్రోల్​, డీజిల్​ కార్లకు బదులు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

‘‘పొల్యూషన్​ తగ్గించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలు కూడా సహకరించాలి. వీలైనంత ఎక్కువగా పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​కు ప్రయారిటీ ఇవ్వాలి. కుదరకపోతే ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ను వాడాలి’’అని జవదేకర్​ చెప్పారు. ఢిల్లీ పొల్యూషన్​పై లోక్​సభలో పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.