
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో ఈవో రమాదేవి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సెంట్రల్ గోదాం, లడ్డూ ప్రసాద కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్‌తో పాటు కల్యాణ కట్ట, కొత్తగా ఏర్పాటు చేసిన స్వామివారి నిత్య కల్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం నిర్వహించే ప్రదేశాలను పరిశీలించారు.
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు కృషి చేయాలన్నారు. అనంతరం విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఈవోకి విప్ శుభాకాంక్షలు తెలిపారు.