యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం భద్రత కట్టుదిట్టం చేయండి : ఈవో వెంకటరావు

యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం భద్రత కట్టుదిట్టం చేయండి  : ఈవో వెంకటరావు
  • యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో వెంకటరావు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఆలయ ఈవో వెంకటరావు అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్టలోని ఈవో క్యాంపు ఆఫీస్ లో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సీఐ భాస్కర్, ఆలయ అధికారులతో కలిసి భద్రతపై సోమవారం రివ్యూ నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయ ప్రాంగణం సహా దేవస్థాన పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా పెట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకు తోడు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కల్యాణకట్ట, వ్రత మండపం, శివాలయం, క్యూలైన్ మార్గంలో బ్యాగేజ్ స్కానర్లు, కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు ఎంట్రీ వద్ద వెహికిల్ స్కానర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రముఖులు సహా భక్తుల వాహనాలు సాధ్యమైనంత మేరకు కొండ కిందనే పార్కింగ్ చేసేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.