పీఎఫ్​ డిపాజిట్లపై 8.15 శాతం వడ్డీ

పీఎఫ్​ డిపాజిట్లపై 8.15 శాతం వడ్డీ

న్యూఢిల్లీ:  రిటైర్‌‌మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ తన ఆరు కోట్ల మంది చందాదారుల  పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2022–-23 ఆర్థిక సంవత్సరానికి గాను  8.10 శాతం నుంచి 8.15 శాతానికి స్వల్పంగా పెంచింది. ఈ వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లోకి జమ చేయాలని తన ఆఫీసులను కోరింది. 

ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్ఓ ట్రస్టీలు ఆమోదించిన ఈపీఎఫ్ వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించిన తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీస్‌‌లు వడ్డీని చందాదారుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి.  

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2021–-22 సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2020-–21లో 8.5 శాతం నుండి నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.10 శాతానికి తగ్గించింది.