ఇపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్ : దీపావళికి జమ కానున్న వడ్డీ ఎంతంటే

ఇపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్ : దీపావళికి జమ కానున్న వడ్డీ ఎంతంటే

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) తన చందాదారులకు చెల్లించే  మొదటి విడత 8.5% వడ్డీ దీపావళికి జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలిపినట్లు హిందుస్తాన్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. సెప్టెంబరులో ఈపీఎఫ్ ఓ ​​సెంట్రల్ బోర్డు 2019-20 సంవత్సరానికి రెండు వాయిదాలలో వడ్డీని చెల్లించాలని నిర్ణయించింది. రెండవ విడత 0.35% వడ్డీతో డిసెంబర్ నాటికి చందాదారులకు జమ అవుతుంది.

ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు

ఈపీఎఫ్  చందాదారులు తమ  UAN నంబర్ EPFO అకౌంట్ లో యాడ్ చేస్తే ఎస్ఎంఎస్ ద్వారా  పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు.  వివరాలు  పొందడానికి 7738299899 నంబర్‌కు ‘ఈపీఎఫ్ ఓ’ అని పంపాల్సి ఉంటుంది.

చందాదారులు తమ వివరాలను హిందీలో పంపించాలనుకుంటే వారు ‘EPFOHO UAN’ వ్రాసి అదే నంబర్‌కు పంపాల్సి ఉంటుంది.

  • ఇంగ్లీష్, పంజాబీ, మరాఠీ, హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాషలలో ఈపీీఎ అకౌంట్ల వివరాల్ని తెలుసుకోవచ్చు.
  • చందాదారుల యుఎన్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతాను వారి శాశ్వత ఖాతా నంబర్ (పాన్) మరియు ఆధార్ కార్డుతో అనుసంధానించాలి.
  • చందాదారులు తమ పాస్‌బుక్‌ను EPFO ​​వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేసిన తర్వాత వారి అకౌంట్ లో బ్యాలెన్స్‌ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. వారి పాస్‌బుక్‌లను యాక్సెస్ చేయడానికి వారు UAN నంబర్ తప్పని సరిగా ఉండాలి.
  • చందాదారులు వెబ్‌సైట్‌లోకి (epfindia.gov.in) లాగిన్ అయి ఇ-పాస్‌బుక్ ఎంపికపై క్లిక్ చేయవచ్చు.
  • వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ మరియు క్యాప్చా కోడ్‌ను నింపిన తర్వాత వారు బ్యాలెన్స్ చూడాలనుకునే సభ్యుల ఐడిని ఎంచుకోవచ్చు.  ఈపీఎఫ్ పాస్ బుక్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దాన్ని భవిష్యత్తులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.