పరిగిలో బీఆర్ఎస్​కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన దోమ ఎంపీపీ

పరిగిలో బీఆర్ఎస్​కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన దోమ ఎంపీపీ
  • కాంగ్రెస్​లో చేరిన దోమ మండల  ఎంపీపీ, ముఖ్య నేతలు

 

పరిగి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టి. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దోమ మండల బీఆర్ఎస్ ఎంపీపీ అనసూయతో పాటు, ఎంపీటీసీ అనిత, అధికార పార్టీకి చెందిన పలు గ్రామాలు సర్పంచ్​లు, మాజీ సర్పంచ్​లు, సుమారు వెయ్యిమందికిపైగా కార్యకర్తలు  శనివారం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి, దోమ మండల బీఆర్ఎస్ జడ్పీటీసీ నాగిరెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల స్కీమ్ ను అమలుచేస్తామన్నారు.