V6 News

బీసీ బిడ్డగా రాజకీయాల్లోకి వస్తా : ఈరవత్రి రాజశేఖర్

బీసీ బిడ్డగా రాజకీయాల్లోకి వస్తా : ఈరవత్రి రాజశేఖర్
  • ఈఆర్​ ఫౌండేషన్​ చైర్మన్​ ఈరవత్రి రాజశేఖర్ 

ఆర్మూర్, వెలుగు :  ప్రజాసేవ చేసేందుకు తాను బీసీ బిడ్డగా రాజకీయాల్లోకి వస్తానని ఆర్మూర్​కు చెందిన ఈఆర్​ ఫౌండేషన్ చైర్మన్​ ఈరవత్రి రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్​లో తప్పకుండా పోటీ చేస్తానన్నారు. ఉన్నత విద్యాభ్యాసం, సామాజిక సేవ, రాజకీయ అనుభవం ఉన్న వాళ్లను ఎన్నుకుంటే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఈఆర్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు. 

ఆర్మూర్​లో రాజకీయ పార్టీల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం తప్పా అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు.  రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అధికారులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ఫౌండేషన్ సభ్యులు నూకల శేఖర్, కొండి రాంచందర్, బోగ రమణ, రాజేశ్వర్ గౌడ్, శ్రావణ్, మోహన్ పాల్గొన్నారు.