హనుమాన్ టెంపుల్‌కు  రూ.50 వేలు విరాళం

హనుమాన్ టెంపుల్‌కు  రూ.50 వేలు విరాళం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని  జిరాయత్ నగర్ హనుమాన్ మందిర అభివృద్ధి కోసం ఈరవత్రి రాందాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ రూ.50 వేలను ఆదివారం విరాళంగా అందజేశారు.  

ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు విట్టోబా శేఖర్‌‌, కార్యదర్శి నూకల శేఖర్‌‌, మందిర కమిటీ సభ్యులు ఈరవత్రి రాందాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్‌‌ను ఘనంగా సన్మానించారు.  కౌన్సిలర్ గంగామోహన్ చక్రు, లింగం,అంబల్ల తిరుపతి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.