హన్మకొండలో ఉద్రిక్తత.. ఆరూరి రమేశ్ను తీసుకెళ్లిన ఎర్రబెల్లి

హన్మకొండలో ఉద్రిక్తత.. ఆరూరి రమేశ్ను తీసుకెళ్లిన ఎర్రబెల్లి

హన్మకొండలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇంటి దగ్గర హైడ్రామ కొనసాగుతోంది మార్చి 12న  హైదరాబాద్ లో కేంద్ర హోమంత్రి అమిత్ షాను  కలిసిన ఆరూరి..ఇవాళ పార్టీకీ రాజీనామా చేసేందుకు సిద్దమై ప్రెస్ మీట్ పెట్టారు. ఈ లోపు అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీలోని ఉండాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆరూరితో ఫోన్ లో పార్టీలోనే ఉండాలని కోరారు.  

ఆరూరి రమేష్ ను తన ఇంటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తీసుకెళ్లారు. దీంతో ఆరూరి అనుచరులు ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. మరోవైపు  అక్కడ ఉన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు.నినాదాల మధ్యనే  ఆరూరి రమేష్ ను బలవంతంగా హనుమకొండ నుంచి హరీశ్ రావు దగ్గరకు   తీసుకెళ్ళారు.

Also Read :పార్టీ మారాలనుకున్న నాయకుడిని.. చెప్పుతో కొట్టిన మహిళ