రామగుండం కార్పొరేషన్ లో ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పులు

రామగుండం కార్పొరేషన్ లో ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పులు

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​లో గురువారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా మారిందని పట్టణవాసులు చెబుతున్నారు. ఒక్కరి పేరే రెండు, మూడు సార్లు నమోదు కావడం, మృతుల పేర్లు తొలగించకపోవడం, వలస వెళ్లిన వారి పేర్లను జాబితాలో అలాగే ఉంచడం వల్ల ఆయా డివిజన్లలో ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. 

ఈ విషయంలో మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. కాగా ఈ నెల 4వరకు రాతపూర్వకంగా అభ్యంతరాలు అందజేయాలని కమిషనర్​ జె.అరుణశ్రీ  కోరారు.