ట్యాంక్ బండ్పై ఏకలవ్య విగ్రహం పెట్టండి.. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి

ట్యాంక్ బండ్పై ఏకలవ్య విగ్రహం పెట్టండి.. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి
  • తెలంగాణ ఎరుకల ప్రజా సమితి

బషీర్​బాగ్, వెలుగు: ట్యాంక్ బండ్​పై ఏకలవ్య విగ్రహానికి స్థలం కేటాయించి, ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి (టీవైపీఎస్) కోరింది. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఏకలవ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా టీవైపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 లక్షల ఎరుకల జనాభా ఉందని, ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​చేశారు. 33 జిల్లా కేంద్రాల్లో ఏకలవ్య విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏకలవ్య జయంతి ఉత్సవాలకు ప్రతి జిల్లాకు రూ.లక్ష బడ్జెట్ కేటాయించాలని, క్రీడల్లో రాణించిన వారికి ఏకలవ్య అవార్డులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.