ఈషా సింగ్: ఆసియాలోనే యంగెస్ట్ షూటర్

ఈషా సింగ్: ఆసియాలోనే యంగెస్ట్ షూటర్

తొమ్మిదేళ్ల వయసున్న పిల్లలు ఏంచేస్తారు? స్కూల్‌ కి వెళ్తారు. లేదంటే ఆటల్లో మునిగిపోతారు. ఈషా సింగ్ కూడా అంతే. స్కూల్ నుంచి రాగానే ఫోన్లో తనకు ఇష్టమైన షూటింగ్ గేమ్స్ఆడేది. కానీ ఈ ఇష్టం కేవలం అక్కడితోనే ఆగలేదు. ఫోన్‌ లో కాకుండా నిజంగా షూటింగ్ గేమ్ ఆడితే ఎలాఉంటుంది? అనుకుంది. ఇక అంతే, నిజమైన రైఫిల్ పట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. రైఫిల్‌ ని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని గురిచూసి కొడుతోంది. షూటింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. ఈషాకు ఇప్పుడు పదమూడేళ్లు. ఆసియాలోనే యంగెస్ట్ షూటర్.

షూటింగ్ పై ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పుడు టెన్నిస్, బ్యాడ్మింటన్ఆడేదాన్ని. తర్వాత ఎందుకో షూటింగ్ మీద ఆసక్తి కలిగింది. నాకు మొదటి నుంచి షూటింగ్, యాక్షన్ గేమ్స్ అంటే చాలా ఇష్టం . ఆ ఇంటరెస్ట్ తోనే షూటింగ్ని ఒకహాబీలా ఆడేదాన్ని. తర్వాత సీరియస్గా తీసుకుందా మనిపించి ప్రొఫెషనల్ పద్ధతిలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను .

శిక్షణ ఎవరి దగ్గర?
ట్రైనింగ్ తీసుకోవాలని ఆలోచన వచ్చిన వెంటనే గగన్ నారంగ్ ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో చేరాను. అక్కడ చాలా కాలం శిక్షణ తీసుకున్నాను . ప్రస్తుతం కోచ్ సుందర్ఘాటే దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను .

చదువు – షూటింగ్ బ్యాలెన్స్ ఎలా?
నేను ప్రస్తుతం సికింద్రాబాద్ మారేడ్పల్లి బోల్టన్ స్కూల్లో చదువుతున్నా. టోర్నమెంట్స్ కోసం అప్పుడప్పుడు ఇతరదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లితిరిగి రాగానే సపరేట్గా హోమ్ ట్యూషన్స్ తీసుకుంటాను . మా స్కూల్ కూడా సపోర్ట్ చేస్తోంది. నాకోసం అప్పుడప్పుడు ఎగ్జామ్స్ కూడా వాయిదా వేస్తుంటారు .

మర్చిపోలేని మ్యాచ్ ఏది?
ఇప్పటి వరకు 56 మెడల్స్ గెలుచుకున్నాను .ఎక్కడా అంతగా ఒత్తిడికి గురవ్వలేదుకానీ, నా రెండో నేషనల్ గేమ్ లో కాస్త భయపడ్డా. నేషనల్స్ కాబట్టి జనం బాగా వచ్చారు. అంత క్రౌడ్ చూడడం అదే మొదటిసారి. దాంతో కాస్త భయం వేసింది. కానీ ఆ ఒత్తిడిలో కూడా ఫోకస్డ్ గా ఆడి గోల్డ్ మెడల్ గెలిచాను. ఆ మ్యాచ్ ఎప్పటికీ మర్చి పోలేను. దీంతోపాటు నవంబర్లో జరిగి ననేషనల్ టోర్నమెంట్ కూడా మర్చి పోలేని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ టోర్నమెంట్ లో గోల్డ్ సాధించి, ఇండియాలోయంగెస్ట్ షూటర్గా నిలిచాను. అప్పటినుంచి నా కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతూ వచ్చింది.

షూటింగ్ గేమ్ ఎలా ఉంటుంది?
గన్తో టార్గెట్ని షూట్ చేయడమే షూటింగ్ గేమ్. టార్గెట్ బోర్డు మీద ఉండే సర్కిల్స్ లో  మధ్య సర్కిల్ను షూట్ చేస్తే పది పాయింట్స్. ఆ సర్కిల్కి దూరం పెరిగేకొద్దీ పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. ముందు క్వాలిఫికేషన్ రౌండ్లో 60 షాట్స్ ఉంటాయి. ఆ రౌండ్లో వచ్చిన స్కోర్ బట్టి మొదటి ఎనిమిది మంది ఫైనల్స్ కి వెళ్తారు. ఫైనల్స్ లో ఎనిమిది మంది స్కోర్ని బట్టి ఫస్ట్ సెకండ్, థర్డ్ఉంటాయి.

రోజూ ఎంత సేపు ప్రాక్టీస్?
రోజూ లేవగానే యోగా చేస్తాను . యోగా తోరోజు పాజిటివ్ గా స్టార్ట్ అవుతుంది. తరువాత షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాను . రోజుకి ఆరుగంటల దాకా ప్రాక్టీస్ చేస్తాను . కొంతసమయం చదువుకి కేటాయిస్తాను . ఎగ్జామ్స్ సమయంలో ఇంకాస్త ఎక్కువ సమయం చదువుకి కేటాయిస్తాను .

షూటింగ్ కి ఎలాంటి స్కిల్స్ కావాలి?
షూటింగ్ ఒక సరళమైన క్రీడ. లక్ష్యానికి గురిపెట్టి షూట్ చేయటమే. అందుకే, ఫలితాల కోసం ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ఎక్కువగా ఆలోచిస్తే, అది క్లిష్టతరంగా మారుతుంది. షూటింగ్ కి ప్రధానంగా ఫోకస్అవసరం. ఎంత ఫోకస్డ్ గా ఉంటే రిజల్ట్అంత ఆక్యురేట్గా ఉంటుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా, మన దృష్టి అంతా టార్గెట్ మీదే ఉండాలి. టెక్నిక్ పైనే దృష్టి పెట్టాలి.

షూటింగ్.. లైఫ్ లో ఎలాఉపయోగపడుతుంది?
షూటింగ్ లో ముందున్న టార్గెట్ ని ఛేదించడానికి ఏమేమి అవసరమో లైఫ్ లో టార్గెట్ రీచ్ అవడానికి కూడా అవేఅవసరం అని నమ్ముతాను . ఇది ముఖ్యం గా క్రమశిక్షణ నేర్పుతుంది. మానసికంగా చాలా ధైర్యాన్నిస్తుంది. లక్ష్యం ముందు అన్నీ చిన్నవే అని నేర్పుతుంది. నెగిటివ్ ఆలోచలను దగ్గరకు రానీయకుండా ఎప్పుడూ పాజిటివ్ గానే ఉండాలని నేర్పుతుంది. టార్గెట్ గురి తప్పినా పాజిటివ్ గానే ఉండడం ముఖ్యం అని ఈ గేమ్ కి వచ్చాక అర్ధంచేసుకున్నా.

ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ?
పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆసియా ఛాంపియన్షిప్ ఫైనల్లో 240.1 స్కోరు సాధించా. ఒలింపిక్స్ లో భారత షూటింగ్ జట్టులోచోటు సాధిస్తా అనేనమ్మకం నాకు ఉంది. భవిష్యత్తు లో భారత్ తరఫున అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడమే నాముందున్న లక్ష్యం. నా ఫేవరెట్ షూటర్ అన్నా కోర్కె. ఆమె గ్రీస్ కి చెందిన షూటర్. లాస్ట్ఒలింపిక్స్ కి  ఛాంపియన్ గా నిలిచింది. ఆమె లాగే నేను కూడా ఒలింపిక్స్ లో గోల్డ్ గెలవాలని కోరుకుంటున్నా.

ఖాళీ సమయాల్లో..
నాకు గోకార్టింగ్ అంటే ఇష్టం . ఖాళీగా ఉన్నప్పుడు రన్ వే 9 కి వెళ్లి గోకార్టింగ్ చేస్తుంటాను . మొబైల్ గేమ్స్ ఆడడం ఆపేశాను.రియల్ గేమ్ ఆడుతున్నా కదా. ఇక మొబైల్గేమ్స్ ఎందుకు!

ఫ్యూచర్ షూటర్లకు ఏదైనా సలహా ?
మనకు ఇంటరెస్ట్ ఉన్నప్పుడు ఎలాగైనా అనుకున్నది సాధించొచ్చు. కేవలం పేరెంట్స్ మీదే ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా ఆలోచించడం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకున్న ఇంటెరెస్టులేంటో తెలుస్తాయి. ఒక సారి మన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటే అందరి నుంచి మంచి సపోర్ట్ఉంటుంది.