ఈఎస్ఐ హాస్పిటల్ డీన్ కు ఎయిమ్స్ డైరెక్టర్ పదవి

 ఈఎస్ఐ హాస్పిటల్ డీన్ కు ఎయిమ్స్ డైరెక్టర్ పదవి

ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ నియామకంపై నెలకొన్న ఊహగానాలకు తెరపడింది. ఎయిమ్స్ డైరెక్టర్గా హైదరాబాద్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ డీన్ డాక్టర్. ఎం. శ్రీనివాస్ను నియమించారు. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిమ్స్ డైరెక్టర్ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.  లేదా 65 సంవత్సరాలు నిండేంత వరకూ ఆ పదవిలో ఉంటారు. డాక్టర్ శ్రీనివాస్  బాధ్యతలు చేపట్టే వరకు డాక్టర్ రణ్ దీప్ గులేరియా డైరెక్టర్ గా కొనసాగనున్నారు. గులేరియా పదవీకాలం 2022 మార్చి 25నే ముగిసినా మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

డాక్టర్ శ్రీనివాస్ 2016 నుంచి హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ డీన్గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు ఆయన ఢిల్లీ ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ పదవి కోసం మొత్తం 32 మంది రేసులో ఉండగా.. చివరకు ఆ అవకాశం శ్రీనివాస్కు దక్కింది.