నూనెలు, పప్పులు, మాస్కుల రేట్లకు రెక్కలు

నూనెలు, పప్పులు, మాస్కుల రేట్లకు రెక్కలు

మినీ లాక్ డౌన్లు, నైట్ కర్వ్యూలు, రిస్ట్రిక్షన్ల వల్ల నిత్యావసరాల రేట్లకు రెక్కలు వస్తున్నాయి. సప్లైలకు ఇబ్బందులు కలుగుతుండటంతో ఆహార పదార్థాలు, మాస్కులు, శానిటైజర్ల వంటివాటి ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే ప్రస్తుతం సప్లైలు బాగానే ఉన్నాయి. రిస్ట్రిక్షన్ల వల్ల వెహికిల్స్ రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. అమెజాన్, ఫ్లిప్ కా ర్ట్, గ్రోఫర్స్ తదితర ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు ఢిల్లీ, ముంబై వంటి సిటీల్లో తగిన సమయానికి డె లివరీలు ఇవ్వలేకపోతున్నాయి. ధరలు మరింత పెరిగి ఉండటంతో వంటనూనెలు, పప్పులు, శానిటైజర్లు, మాస్కులు, ఆక్సిమీటర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. దీంతో డిమాండుకు తగ్గట్టున ఉండక, రేట్లు పెరుగుతు న్నాయి. రిఫ్రిక్షన్ల వల్ల కార్మికులు దొరకడం లేదని, ఉద్యోగులు కూడా రాలేకపోతుండటంతో సమస్య లు పెరుగుతున్నాయని ముంబైలోని అందరిలో షాపు నడిపే అశ్మిత్ దలాల్ అన్నారు. మహారా ష్ట్రలో దుకాణాలను ఉదయం ఏడింటి నుంచి ఉదయం 11 గంటలకు మాత్రమే నడపాలని ఆదేశాలు ఉన్నాయి. రాత్రి ఎనిమిదింటి వరకు మాత్రమే ఆన్లైన్ కంపెనీలు డెలివరీలు ఇవ్వాలి. ములుండకు చెందిన ప్రియాంకా సింగ్ మాట్లాడు తూ తాను బిగ్బ స్కెట్ ద్వారా సరుకులు ఆర్డర్ చేస్తానని, రెండు రోజులకు ఒకసారి మాత్రమే వాళ్ల డెలివరీ వ్యాన్ వస్తోందని చెప్పారు.

బోండాం రేటు రూ.80!

గత కొన్ని రోజుల నుంచి పళ్లు, కూరగాయల ధరలు బాగా పెరిగాయని ఢిల్లీవాసి నేహా గ్రోవర్ అన్నారు. కొబ్బరిబోండాం వంటివి అయితే సిటీలో ఎక్కడా దొరకడం లేదని, సఫైలు లేవనిదు కాణదారులు చెబుతున్నారని వివరించారు. కొన్ని రోజుల క్రితం దాకా రూ. 40 ఉన్న బోందాంకు ఇప్పుడు రూ.80 పెట్టాల్సి వస్తోందని అన్నారు. గ్రో ఫర్స్, బిస్కెట్, అమెజాన్ కంపెనీల డెలివరీ లు చాలా ఆలస్యమవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇది వరకు రెండు గంటల్లోపు డెలివరీ రిస్ట్రిక్షన్లతో తగ్గిన సప్లైలు ఆలస్యమవుతున్న ఆన్లైన్ డెలివరీలు వచ్చేదని, ఇప్పుడు కనీసం రెండు రోజులకు పైగా ఆగాల్సి వస్తోందని హైదరాబాద్కు చెందిన ఒక హౌస్వైఫ్ చెప్పారు. ధరలు కూడా పెరిగాయని అన్నారు. "కరోనా సెకండ్ వేవ్ వల్ల జనంలో మళ్లీ భయం మొదలయింది. ప్యానిక్ బయింగ్ కనిపి స్తోంది. మాకు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితిని మేం ముందే ఊహించి డెలివరీ కెపాసిటీని పెంచాం. అయితే మినీలాక్ డౌన్లు, నైట్ కర్న్యూల వల్ల తగిన టైమ్లో డెలివరీ ఇవ్వలే కపోతున్నాం. వెహికిల్స్ రాకపోకలకు ఇబ్బందు లు వస్తున్నాయి” అని బిగ్బాస్కెట్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. గత ఏడాది సప్లైచె యిన్లకు ఇబ్బందులు కలగడం వల్ల వ్యాపారులు సరుకులను దాచిపెట్టారని, ఈ సారి అటువంటి పరిస్థితి లేదని అన్నారు. కరోనా కేసులు పెరగ్గా నే అప్రమత్తమైన కంపెనీలు కూడా సప్లైని బాగా పెంచాయి. అయితే కార్మికులు దొరక్కపోవడం, రిస్ట్రిక్షన్ల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో సిటీల్లో వంట నూనెల ధరలు 15 శాతం వరకు, పప్పుల ధరలు 10 శాతం వరకు పెరిగాయని హోల్సేల్ వ్యాపారు లు చెప్పారు. కొన్ని బ్రాండ్ల వంటనూనెలు అసలు దొరకడం లేదన్నారు. నారంగ్ అనే ఫార్మాషాపు యజమాని మాట్లాడుతూ ప్రస్తుతానికి శానిటైజర్ల సప్లైబాగానే ఉన్నా, రాబోయే రోజుల్లో సఫైలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆక్సిమీటర్ల రేట్లు కూడా రూ. రెండు వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయని అంటున్నారు.

గత రెండు నెలలుగా వంటనూనెల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని బ్రాండ్ల పాలు, గోధుమ పిండి, పప్పుల రేట్లూ పెరిగాయి. కూరగాయలు, పళ్లవంటి రేట్లు ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయి. కొన్ని చోట్ల మామూలు రేట్లే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రిస్టికన్లే ఇందుకు కారణం

అక్షయ్ డిసౌజా సీఈఓ, బైజామ్ 
రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్