మాయ మూవీ టీజర్‌‌‌‌ విడుదల

మాయ మూవీ టీజర్‌‌‌‌ విడుదల

ఎస్తర్ నోరోన్హా, కిరణ్ ఆవల, సిరిచందన లీడ్‌‌ రోల్స్‌‌లో రమేష్ నాని తెరకెక్కించిన చిత్రం ‘మాయ’. రాజేష్ గొరిజవోలు నిర్మాత. మంగళవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్తర్‌‌‌‌ మాట్లాడుతూ ‘కథ చాలా కొత్తగా ఉంది, ఇలాంటి కథలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలని ఈ చిత్రానికి ఓకే చెప్పాను. ఇలాంటి టీమ్‌‌తో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది.

కంటెంట్‌‌ను నమ్మి తీసిన మిస్టీరియస్‌‌ థ్రిల్లర్‌‌‌‌ ఇదని చెప్పాడు హీరో కిరణ్ ఆవల. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారని, టీమ్ వర్క్ చాలా నచ్చిందని సిరి చందన చెప్పింది. సినిమా ఆధ్యాంతం అలరించే విధంగా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుందని దర్శకనిర్మాతలు తెలిపారు.