యూరో కప్‌ చాంప్‌గా ఇటలీ

యూరో కప్‌ చాంప్‌గా ఇటలీ

లండన్: యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఇటలీ దుమ్మురేపింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై గెలిచి యూరో కప్‌ను ముద్దాడింది. పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసిన మ్యాచ్‌లో ఒక గోల్ తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన ఇటలీ.. 1968 తర్వాత మరోసారి కప్‌ను కైవసం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమానంగా నిలిచాయి. దీంతో ఆట అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలం అయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. దీంట్లో ఇటలీ ప్లేయర్లు ఆరు చాన్సుల్లో మూడింటిని గోల్స్‌గా మలచగా.. ఇంగ్లాండ్ రెండు గోల్స్ మాత్రమే చేసి మ్యాచ్‌ను తద్వారా కప్‌ను చేజార్చుకుంది.