డార్ట్‌మండ్ : యూరో కప్‌లో ఇంగ్లండ్ మరోసారి టైటిల్ ఫైట్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీస్‌లో ఇంగ్లండ్ 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఆట ఆరంభం నుంచి ఎదురుదాడులకు దిగిన నెదర్లాండ్స్ ఏడో నిమిషంలోనే జేవి సిమన్స్ గోల్‌తో లీడ్‌లోకి వెళ్లింది. కానీ ఆ తర్వాత బాల్‌ను ఆధీనంలో ఉంచుకోవడంలో ఫెయిలైంది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ కేన్ (18వ ని.) గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు.
ఇక్కడి నుంచి ఇరుజట్లూ షార్ట్ పాస్‌లతో పరస్పరం గోల్ పోస్ట్‌లపై ఎదురుదాడికి దిగాయి. అయినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ మ్యాచ్ చివర్లో ఓలీ వాట్కిన్సన్ (90వ ని.) గోల్ కొట్టి ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ నెల 15న జరిగే ఫైనల్లో ఇంగ్లండ్.. స్పెయిన్‌తో తలపడుతుంది.