ఇవాస్​ నుంచి బీఎల్​ డీసీ ఫ్యాన్లు

ఇవాస్​ నుంచి బీఎల్​ డీసీ ఫ్యాన్లు

హైదరాబాద్​, వెలుగు :  భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫోటాన్ ఆర్బ్ సీవ్ (పీఓఎస్​) టెక్నాలజీ గల మాగ్నస్​ ఫ్యాన్లను మార్కెట్​కు పరిచయం చేసినట్టు ఇవాస్​  ఎలక్ట్రికల్స్​​ ప్రకటించింది. ఎక్కువ ఎయిర్ -డెలివరీ సామర్థ్యం దీని సొంతం. ఇందులో 32 వాట్ల బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్

(బీఎల్​డీసీ) మోటార్ తగినంత గాలిని అందిస్తుంది. కరెంటును తక్కువగా వాడుకుంటుంది. డిజైన్​కూడా అద్భుతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిని హైదరాబాద్​లోని తమ యూనిట్లోనే తయారు చేస్తున్నామని ఇవాస్ ​వెల్లడించింది.