బిల్లులు ఎందుకియ్యట్లే మండల సమావేశంలో ..సర్పంచుల నిలదీత

బిల్లులు ఎందుకియ్యట్లే మండల సమావేశంలో ..సర్పంచుల నిలదీత

మరికల్, వెలుగు: వైకుంఠధామం పనులు పూర్తి చేసి రెండేండ్లు కావస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదని మండల సర్వసభ్య సమావేశంలో  మరికల్​ సర్పంచ్​ కె.గోవర్దన్​ నిలదీశారు. గురువారం ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ శ్రీకళ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 5 లక్షలు అప్పులు తెచ్చి పనులు పూర్తి చేశానని, బిల్లులు ఇవ్వడం లేదని ఆయన వాపోయాడు. ఆన్​లైన్​లో బిల్లులు సబ్​మిట్​ చేశామని పై నుంచి రాలేదని ఏఈ సమాధానం ఇచ్చారు. 

వడ్లు అమ్మిన డబ్బులు రైతులకు రావడం లేదని సర్పంచ్​ ఆంజనేయులు నిలదీశారు. వైస్​ ఎంపీపీ రవికుమార్, రైతుబంధు అధ్యక్షుడు సంపత్​కుమార్, తీలేరు పీఏసీఎస్​ అధ్యక్షులు రాజేందర్​గౌడ్, ఎంపీడీవో యశోదమ్మ పాల్గొన్నారు.