చైనాలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. పెరుగుతున్న కరోనా కేసులు

చైనాలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. పెరుగుతున్న కరోనా కేసులు
  • షాంఘైలో నిన్న ఒక్కరోజే 52 మంది మృతి
  • షాంఘైలో ఇప్పటి వరకు 190కి చేరిన కోవిడ్ మృతుల సంఖ్య

బీజింగ్:  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా  తీవ్రంగా శ్రమిస్తోంది. బీజింగ్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సోమవారం చొయాంగ్ జిల్లాలోని 35 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.  మొత్తం 2 కోట్ల 10 లక్షల కొవిడ్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు 38 కరోనా పాజిటివ్ కేసులకు జినోమ్ సీక్వెన్సింగ్ చేయగా వాటన్నింటిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు వైద్యాధికారులు.
బీజింగ్ వాసులకు లాక్ డౌన్ భయం.. సరుకుల కోసం మార్కెట్లలో బారులు 
కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతుండడంతో.. బీజింగ్ వాసులకు లాక్ డౌన్ భయం పట్టుకుంది. ఇప్పటికే నాలుగు వారాలుగా షాంఘై ప్రజలు లాక్ డౌన్ లోనే ఉండిపోవడంతో.. అటువంటి ఆంక్షలు ఇక్కడా అమలు చేస్తారనే ఆందోళన నెలకొంది. దీంతో నిత్యావసర వస్తువులను తెచ్చుకునేందుకు మార్కెట్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిమాండుకు సరిపడా సరుకులు అందుబాటులో ఉంచామంటున్నారు  బీజింగ్ అధికారులు. 
షాంఘైలో 5లక్షలకు చేరిన పాజిటివ్ కేసులు
మరోవైపు కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ షాంఘైలో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం 5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయ. ప్రస్తుతం రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా నుంచి మరణాలు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే మరో 52 మంది కొవిడ్ బాధితులు చనిపోయారు. దీంతో షాంఘై సిటీలో కొవిడ్ మృతుల సంఖ్య 190కి చేరింది. అయితే వృద్ధుల సంఖ్య అధికంగా ఉండడం, వారికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో కొవిడ్ మరణాలు అధికంగా నమోదవుతున్నాయని అన్నారు షాంఘై అధికారులు. 

 

ఇవి కూడా చదవండి

మే 6న జలసౌధలో కేఆర్ఎంబీ మీటింగ్

వీ6–వెలుగు పిటిషన్​పై హైకోర్టు కీలక ఆదేశాలు

టీఆర్​ఎస్​తో ప్రశాంత్ కిశోర్ దోస్తీ

చిరు వ్యాపారులపై గ్రీన్ ఫండ్ బాదుడు