బైపోల్ లేకున్నా ఆర్మూర్ లో అప్పుడే ఎన్నికల హడావిడి

 బైపోల్ లేకున్నా ఆర్మూర్ లో  అప్పుడే ఎన్నికల హడావిడి

ఎన్నికలకు ఇంకా సమయం ఉంది.. కానీ ఒక నియోజక వర్గంలో మాత్రం బైపోల్ లేకున్నా అప్పుడే ఎన్నికల హడావిడి మొదలయింది.  ఓ పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలు అదిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరు కేడర్ మొత్తాన్ని సెగ్మెంట్ లో దించితే.. మరొకరు తానే కాబోయే ఎమ్మెల్యే అని ప్రచారం చేసుకుంటున్నారు. తానూ ఉన్నానంటూ మరొకరు తెరపైకి వచ్చారు. దీంతో జిల్లాలో ఆ నియోజకవర్గం గురించి ఆసక్తికరచర్చ జరుగుతోంది.