
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి... ఇండియన్ ఆర్మీపై పాక్ ప్రభుత్వం ప్రత్యక్ష యుద్ధం ప్రకటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిస్రి. జనావాసాలే లక్ష్యం గాచేసుకుని పాక్ దాడులు చేస్తోందని అన్నారు. పాక్ ఫాల్స్ ప్రచారం చేస్తోందని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు విక్రమ్ మిస్రి. పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే ఛీకొడుతున్నారని అన్నారు.
అధంపూర్ ఆర్మీ బేస్ ధ్వంసం చేశారనేది తప్పుడు ప్రచారమని.. పంజాబ్,రాజస్థాన్, జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లోని పౌరులే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడుతోందని అన్నారు విక్రమ్ మిస్రి. భారత ఆర్మీ బేస్ లకు ఎక్కడా నష్టం జరగలేదని.. పాక్ దాడుల్లో జమ్ముకశ్మీర్ అధికారి రాజ్ కుమార్ చనిపోవడం దురదృష్టకరమని అన్నారు.పాక్ దాడుల్లో ఎలాంటి డిఫెన్స్ సిస్టంలకు నష్టం కల్గలేదని స్పష్టం చేశారు విక్రమ్ మిస్రి.
కాగా.. భారత్ పై పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు ప్రకటించింది పాక్. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది పాక్. శనివారం ( మే 10 ) నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ.
ఈ క్రమంలో పాక్ దాడులను మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడి చేసినట్లు తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు మురిద్, షార్‌కోట్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే భారత ఆర్మీ దాటికి విలవిలలాడుతున్న పాక్.. ప్రపంచవ్యాప్తంగా ఏకాకిగా మారింది. ఈ పరిస్థితిలో ప్రత్యక్ష యుద్దానికి సిద్దమైన పాక్.. భారత్ దాడిని ఏమేరకు ఎదుర్కొంటుందో చూడాలి.