శాంతి పాత్రతో ఆ కోరిక తీరింది: ఈషా రెబ్బా

శాంతి పాత్రతో ఆ కోరిక తీరింది: ఈషా రెబ్బా

‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని, ఇందులో శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని హీరోయిన్ ఈషా రెబ్బా చెప్పింది. తరుణ్ భాస్కర్ లీడ్‌‌‌‌గా  ఏఆర్ సజీవ్ రూపొందించిన ఈ చిత్రాన్ని  సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని,  అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి కలిసి నిర్మించారు. జనవరి 30న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా చెప్పిన విశేషాలు.

‘‘ఇది రీమేక్ అయినా యూనివర్సల్‌‌‌‌గా అందరికీ  కనెక్ట్ అయ్యే స్టోరీ.  మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో పాత్రల్లో చాలా మార్పులు చేశారు.  ఇందులో ఉండే ఎమోషన్స్ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలాగ  ఉంటాయి.  సినిమా చూస్తున్నప్పుడు రీమేక్ అనే ఫీలింగ్ రాదు. ఇందులో అన్ని క్యారెక్టర్స్‌‌‌‌కి ఆడియెన్స్ రిలేట్ అవుతారు.  నాకు శాంతి క్యారెక్టర్ చేయడం ఎక్సయిటింగ్‌‌‌‌గా అనిపించింది.  కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఒక్కసారైనా ఇలాంటి పాత్ర వస్తే చేయాలనుకునేదాన్ని. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను.

ఇందులోని మెయిన్ కాన్‌‌‌‌ఫ్లిక్ట్‌‌‌‌ను  ఫన్నీగా చూపించాం. ఎక్కడా మెసేజ్ ఇచ్చినట్లుగా ఉండదు. ఒక యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లో  తరుణ్‌‌‌‌కి నాకు ఇద్దరికీ దెబ్బలు తగిలాయి.  తరుణ్ భాస్కర్‌‌‌‌‌‌‌‌తో వర్క్ చేయడం  హ్యాపీగా అనిపించింది. ఆయన స్వతహాగా దర్శకుడు అయినా ఈ చిత్రం విషయంలో నటనపైనే ఫోకస్ పెట్టారు.  తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది.  దర్శకుడు సజీవ్‌‌‌‌కి  క్లియర్ విజన్ ఉంటుంది. అనుకున్నది కచ్చితంగా చేస్తాడు. ఈ కథకి వంద శాతం న్యాయం చేశాడు’’.