కొత్త వేషగాళ్ల మాటలు నమ్మితే మోసపోతాం : బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

కొత్త వేషగాళ్ల మాటలు నమ్మితే మోసపోతాం :  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త రకం వేషగాళ్లు వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మితే మోసపోతామని బీఆర్ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో   ప్రచారం చేసిన అనంతరం గద్వాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయన్నారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజలు  అష్టకష్టాలు పడ్డారని, మళ్లీ ఆ కష్టాలను కొని తెచ్చుకోవద్దన్నారు. కేసీఆర్​ వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. తాను లోకల్ అని, ఇక్కడే పుట్టాను  ఇక్కడే పెరిగాను ఇక్కడి మట్టిలోనే కలుస్తానని ఆయన ఎమోషనల్​ అయ్యారు. అభివృద్ధి కావాలో, అవినీతిపరులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. అలంపూర్ వారిని బయటకు పంపి గద్వాల పౌరుషాన్ని నిలబెట్టాలన్నారు. ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని మరొకసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.