మల్లన్న జాతరలో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి : దేవకీ దేవి

మల్లన్న జాతరలో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి : దేవకీ దేవి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న జాతరలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సిద్దిపేట డీపీఓ దేవికి దేవి అన్నారు. మంగళవారం కొమురవెల్లిలో స్వచ్ఛ కొమురవెళ్లి- స్వచ్ఛ మల్లన్న పేరిట ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాల గురించి స్థానికులకు, దుకాణ దారులకు, ప్రైవేటు సత్రాల యజమానులకు అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా డీపీవో  దేవకీ దేవి..  మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో మానవ మనుగడకు ఎంతో హాని కలుగుతుందన్నారు.  

జీవో 40  ప్రకారం ప్లాస్టిక్ వాడొద్దని,  వాడితే జరిమానాతో పాటు చట్ట పరమైన చర్యలు ఉంటాయన్నారు.  భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.  సర్పంచ్ సార్ల లత కిష్టయ్య, జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప, ఏఈఓ వైరాగ్యం అంజయ్య, ఎంపీడీఓ అనురాధ, ఎస్సై నాగరాజు, సెక్రటరీ లోకేష్ రెడ్డి, ఆలయ సిబ్బంది, స్థానికులు,  ప్రయివేటు సత్రాల యజమానులు పాల్గొన్నారు.