
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో పేదల కోసం ఏర్పాటు చేసిన గవర్న్మెంట్ హాస్పిటల్సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 59 జీవో పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేసి మాట్లాడారు. తన తుది శ్వాస వరకు సిద్దిపేట ప్రజల సేవలో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పేదలు ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని, గవర్న్మెంట్హాస్పిటల్లో అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. నియోజకవర్గంలో 11 వేల మందికి కల్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయాన్ని అందించామన్నారు. ఈ సందర్భంగా 120 మందికి 59 జీవో పట్టాలను అందజేశారు. అంతకు ముందు లింగారెడ్డి పల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సరస్వతి శిశు మందిర్ విద్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.