గుజరాత్ ఎన్నికలు : కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి

 గుజరాత్ ఎన్నికలు : కాంగ్రెస్లో  చేరిన మాజీ మంత్రి

అహ్మదాబాద్: ఇటీవల అధికార బీజేపీకి రాజీనామా చేసిన గుజరాత్ మాజీ మంత్రి  జై నారాయణ్ వ్యాస్  ప్రతిపక్ష కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  సమక్షంలో  తన కుమారుడు సమీర్ వ్యాస్‌తో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. నరేంద్ర మోడీ గుజరాత్  సీఎంగా ఉన్న సమయంలో  నారాయణ్ వ్యాస్  మంత్రిగా ఉన్నారు.  వైద్య ఆరోగ్యం సహా పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు.  

జై నారాయణ్‌కు సిధ్ద్‌పూర్‌ నుంచి ఏడు సార్లు పోటీ చే సి 4సార్లు గెలిచారు. మోడీకి అత్యంత నమ్మకస్తుడిగా జై నారాయణ్ వ్యాస్ పేరుంది. కాగా 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి.  ఏడోసారి అధికారంలోకి రావడంపై బీజేపీ ఫోకస్ చేస్తుండగా ఆ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, ఆప్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.