నంద్యాల టీడీపీలో వర్గపోరు.. మాజీ మంత్రి అఖిల ప్రియ & ఏ వి సుబ్బారెడ్డి వర్గాల మధ్య కొట్లాట

నంద్యాల టీడీపీలో వర్గపోరు.. మాజీ మంత్రి అఖిల ప్రియ & ఏ వి సుబ్బారెడ్డి వర్గాల మధ్య కొట్లాట

నంద్యాల టీడీపీలో వర్గపోరు.. బాహాబాహీ వరకు వెళ్లింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అదే పార్టీకి చెందిన అఖిలప్రియ వర్గం దాడి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తనపై దాడి చేయడంపై ఏవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే డైరెక్ట్‌గా కక్ష తీర్చుకోవాలంటూ సవాల్ విసిరారు ఏవీ.

నంద్యాల టీడీపీలో వర్గ విబేధాలు

నంద్యాల జిల్లా టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమంటున్నాయి.. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆదే పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్రంగా గాయపడ్డారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

ఏవీ సుబ్బారెడ్డిపై ..అఖిలప్రియ వర్గం దాడి

నారాలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతుంది. ఈ యాత్రలో వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే, అఖిలప్రియ వర్గానికి చెందిన కొందరు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఆయన గాయాలు అయ్యాయి. లోకేష్ ముందే ఈ దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. AV సుబ్బారెడ్డిని  అఖిలప్రియ వర్గానికి చెందిన వారు వెంబడించి దాడి చేశారు. 

నంద్యాలలో భారీ భద్రత

నంద్యాలలో ఈ ఘటన ఏ పరిస్థితులకు దారితీస్తుందోనని పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. మరోవైపు.. దాడి ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు.. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతున్నారు. ఘర్షణలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.