మీ అధికారులకు వావి వరసలు తెలియవా?

మీ అధికారులకు వావి వరసలు తెలియవా?

హైదరాబాద్: భూ ఆక్రమణలకు పాల్పడ్డానంటూ తనపై వచ్చిన ఆరోపణల మీద టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. తాను ఎప్పుడూ అణచివేతకు పాల్పడలేదని స్పష్టం చేశారు. జమున హ్యాచరీస్ అంటే తన భార్య, కొడుకు, కోడలికి నోటీసులు పంపాలని.. కానీ తనకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌కు ఓ విషయం విజ్ఞప్తి చేస్తున్నా. అసలు రిపోర్టులో నా పేరు ఎలా పెడతారు? జమున హ్యాచరీస్ చైర్మన్ జమున కాదు.. నా కొడుకు నితిన్, నా కోడలు. మీ అధికారులు జమున వైఫ్ ఆఫ్ నితిన్ అని రాస్తున్నారు. వారికి వావి వరసలు కూడా తెలియవా? ఇది ఆలోచన చేయాలి సీఎంగారు. మీకూ కొడుకు, బిడ్డలు ఉన్నారు. మీకు వావి వరసలు, సంస్కృతి తెలుసు’ అని ఈటల ఘాటుగా వ్యాఖ్యానించారు.